హాజ్ బోర్డ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కార్పొరేటర్ మక్బూల్ కుసత్కారం

హాజ్ బోర్డ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కార్పొరేటర్ మక్బూల్ కుసత్కారం

0
TMedia (Telugu News) :

*హజ్ యాత్రికులకు అవగాహన

-విజయవంతంగా ముగిసిన వ్యాక్సినేషన్

హాజ్ బోర్డ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కార్పొరేటర్ మక్బూల్ కుసత్కారం

టి మీడియా, జూన్ 14ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు తీపికబురు అందించింది . ఈ నెల 26 న రాష్ట్రవ్యాప్తంగా హజ్ చేసే హజ్ యాత్రికులకు లైన్ క్లియర్ చేసింది . గతoలో వున్న కొవిడ్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో హజ్ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి . ఈ నేపథ్యంలో సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో గల వారు యాత్రకు వెళ్లే యాత్రికులకు అవగాహన , వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది . ఈ సందర్భంగ రాష్ట్ర కమిటీ సభ్యులు తెరాస కార్పొరేటర్ షేక్ మక్బూల్ , మత పెద్దలు , ముఫ్తీలు సయీద్ అహ్మద్ ఖాష్మి , జలాలుద్దీన్ సహాబ్ , రవూఫ్ ఖాన్ సాహెబ్ , వాలంటీర్ ఖుర్శీద్ లు మాట్లాడారు .

Also Read:బూస్టర్ డోస్‌కు అనుమతివ్వండి

ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఎక్కువ పుణ్యాలు లభించే పుణ్యకార్యాల అశాలను పటిస్తూ . యాత్ర సాగాలని యాత్రచేసేవారు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు . తదనంతరం తెలంగాణ ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు . ఖమ్మం జిల్లా నుంచి హజ్ బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యులు తెరాస కార్పోరేటర్ మక్బూల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హజ్ యాత్ర సందర్భంగా మతపెద్దలు , యాత్రికులు హాజ్ బోర్డు సభ్యులు మత పెద్దలను ఘనంగా సత్కరించారు . అనంతరం యాత్రికులు సైతం వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు . హజ్ చేసేవారికి రవాణా లగేజి కోసం బ్యాగులను అందజేశారు . ఈ కార్యక్రమంలో హజ్ యాత్రికులు , ముఫ్తిలు , హాఫీజ్ లు , మౌలానా లు తదితరులు పాల్గొన్నారు .

Also Read:ప‌ది’లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే బాస‌ర‌ ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube