తెలంగాణ లో ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు
టీ మీడియా,మార్చి12,హైదరాబాద్:
ఈ నెల 16 వ తేదీ నుండి ఏప్రిల్ 23 తారీకు వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయము 7:45 నుండి మధ్యాహ్నం 12:00 వరకు నియమిత వేళలా నిబంధనలను పెట్టింది. అయితే ఇక జూన్ 12 వ తేదీ నుండి నూతన అకాడమిక్ విద్య సంవత్సరం మొదలు కానుంది.
*తల్లిదండ్రులకు పోలీస్ శాఖ సూచనలు
-విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన తర్వాత విద్యార్థులను బయట తిరగనీయరాదు.
-మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల పై కేసుల నమోదు,వాహనాలు సీజ్ చేయబడతాయి.
– పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించినా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా అటువంటి కంప్లైంట్స్ స్కూల్ యాజాన్యం నుండి వచ్చిన యెడల టీసీలు ఇచ్చి ఇంటికి పంపివేయబడతారు.
మరే ఇతర స్కూల్లో జాయిన్ చేసుకొని విధంగా చర్యలు తీసుకోబడతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతటివారైనా అందరికీ ఒకే విధంగా చర్యలు తీసుకోబడతాయి.
Also Read : నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
– విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు,
ఏం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు, దుర్వ్యసనాలకు పాల్పడుతున్నారా అనే విషయాలపై పూర్తి స్పృహ కలిగి ఉండాలి, ఎప్పటికప్పుడు వారి కదలికలపై దృష్టి సారిస్తూ ఉండాలి.
-పిల్లలకు ఫోన్ లు ఇవ్వడం, పర్సనల్ కంప్యూటర్లు ఇవ్వడం చేయరాదు. ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే వాటి వినియోగం పై పూర్తి నిఘా ఉంచాలి.
పిల్లలు ధరించే దుస్తులు హెయిర్ కటింగ్ పై శ్రద్ధవహించాలి. పాశ్చాత్య సంస్కృతులకు దూరంగా ఉంచాలి.
-పిల్లలు చేస్తున్న స్నేహాలపై మరియు స్నేహితుల అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
-శారీరకశ్రమ అందించే క్రీడలకు ప్రోత్సహించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
8. పిల్లలను ప్రేమగా చూసుకోవడం మంచిదే కానీ అతి ప్రేమతో వారిని మొండి వారిగా తయారు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి,
మొక్కై వంగనిది మానై వంగదని తల్లిదండ్రులు గమనించాలి