ఇజ్రాయిల్ దాడిలో హమాస్ వైమానిక ద‌ళాధిప‌తి హ‌తం

ఇజ్రాయిల్ దాడిలో హమాస్ వైమానిక ద‌ళాధిప‌తి హ‌తం

0
TMedia (Telugu News) :

ఇజ్రాయిల్ దాడిలో హమాస్ వైమానిక ద‌ళాధిప‌తి హ‌తం

టీ మీడియా, అక్టోబర్ 28, జెరుస‌లాం: హ‌మాస్‌కు చెందిన వైమానిక ద‌ళ అధిప‌తి ఇస్సామ్ అబూ రుక్బే.. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హ‌త‌మయ్యాడు. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో అత‌ను చ‌నిపోయిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు ఈ విష‌యాన్ని ద్రువీక‌రించాయి. హ‌మాస్ ఉగ్ర గ్రూపుకు చెందిన డ్రోన్లు, ఏరియ‌ల్ వెహికిల్స్‌, ప్యారాగ్లైడ‌ర్స్‌, ఏరియ‌ల్ డిటెక్ష‌న్ సిస్ట‌మ్స్‌ను అబూ రుక్బే మేనేజ్ చేసేవాడ‌ని ఇజ్రాయిల్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హ‌మాస్ చేసిన భీక‌ర రాకెట్ దాడిలో అబూ రుక్బే కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఐడీఎఫ్ వెల్ల‌డించింది. రుక్బే ఆదేశాల ప్ర‌కార‌మే హ‌మాస్‌కు చెందిన పారాగ్లైడ‌ర్లు.. ద‌క్షిణ ఇజ్రాయిల్ భూభాగంలోకి వ‌చ్చిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది.

Also Read : పదవుల కోసం అధమస్థాయికి దిగజారిన తుమ్మల

త‌మ ర‌క్ష‌ణ ద‌ళాల పోస్టుల‌పై డ్రోన్లతో దాడి చేసింది కూడా రుక్బే వ‌ల్లే అని ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ 14వ తేదీన జ‌రిగిన దాడిలో.. హ‌మాస్ ఏరియ‌ల్ ఫోర్సెస్‌కు చెందిన మాజీ చీఫ్ మురాద్ అబూ మురాద్ హ‌త‌మైన‌ట్లు గ‌తంలో ఐడీఎఫ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube