ఉత్త‌ర కొరియా గ్రేనేడ్ రాకెట్ల‌ను వాడిన హ‌మాస్

ఉత్త‌ర కొరియా గ్రేనేడ్ రాకెట్ల‌ను వాడిన హ‌మాస్

0
TMedia (Telugu News) :

ఉత్త‌ర కొరియా గ్రేనేడ్ రాకెట్ల‌ను వాడిన హ‌మాస్

టీ మీడియా, అక్టోబర్ 19, గాజా: గాజాపై అక్టోబ‌ర్ 7వ తేదీన హ‌మాస్ ఉగ్ర‌వాదులు వేల సంఖ్య‌లో రాకెట్ల‌తో విరుచుకుప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడిలో ఉత్త‌ర కొరియాకు చెందిన ఎఫ్‌-7 రాకెట్ గ్రేనేడ్ల‌ను హ‌మాస్ వాడిన‌ట్లు తెలుస్తోంది. హ‌మాస్‌కు చెందిన కొన్ని ఆయుధాల‌ను ఇజ్రాయిల్ సీజ్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఆయుధ నిపుణుల విశ్లేష‌ణ ప్ర‌కారం.. హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఉత్త‌ర కొరియాకు చెందిన ఎఫ్‌-7 రాకెట్ గ్రేనేడ్ల‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. భుజంపై నుంచి కాల్చే ఆ ఆయుధాల‌ను సాధార‌ణంగా ఆర్మీ వాహ‌నాల‌ను పేల్చేందుకు వాడుతుంటారు. రాకెట్ గ్రేనేడ్ల‌ను సింగిల్ వార్‌హెడ్‌గా వినియోగిస్తారు. చాలా వేగంగా దాన్ని రీలోడ్ చేయ‌వ‌చ్చు. గెరిల్లా ద‌ళాలు ఈ ఆయుధాల‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు.

Also Read : రాహుల్‌ గాంధీ మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు

సిరియా, ఇరాక్‌, లెబ‌నాన్‌, గాజా స్ట్రిప్‌లో ఎక్కువ‌గా ఎఫ్‌-7 రాకెట్ల‌ను గుర్తించిన‌ట్లు ఆయుధ నిపుణుడు ఎన్ఆర్ జెన్‌జెన్ జోన్స్ తెలిపారు. చాన్నాళ్ల నుంచి పాల‌స్తీనా మిలిటెంట్ గ్రూపుకు నార్త్ కొరియా స‌పోర్టు ఇస్తుంద‌ని, ఆ దేశానికి చెందిన ఆయుధాలు సిరియా ప్రాంతాల్లో గుర్తించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube