ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయి

ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయి

0
TMedia (Telugu News) :

ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయి

– టిడిపి అధినేత చంద్రబాబు

టీ మీడియా, డిసెంబర్ 8, గుంటూరు : : టిడిపి అధినేత చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నేడు తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించి, రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు. పర్యటనకు వెళుతూ.. మార్గంలో దేవేంద్రపాడు వద్ద నిరసన చేస్తున్న రైతులను చూసి వారిని కూడా పరామర్శించి మాట్లాడారు. పంట నష్టం అంచనాకు ప్రభుత్వం ఇంతవరకు రాలేదని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయని అన్నారు.

Also Read : తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

తాను పర్యటిస్తున్నానని ఆ కారణంగా జగన్‌ హడావుడిగా బయలుదేరారని విమర్శించారు. పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube