హరితహారం డబ్బులు నర్సరీ వారికి పలహారం
ఖమ్మం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న హరిత హారం కొంతమంది అధికారులు,ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అందుకు నిదర్శనం ఖమ్మం నగరం లో ని పలుడివిజనులకు సరఫరచేసిన విలువైన మొక్కలకు వేళ్ళు లేని కొమ్మలను ప్లాస్టిక్ సంచిలో ని మట్టిలో కూర్చి సరఫరా చేసి బారి అవినీతి కి పాల్పడ్డరు. రాష్ట్ర వ్యాపతంగా పలుప్రాంతాల్లో ఇదే తంతు నడచినట్లు తెలిసింది. ముక్యంగా ఖమ్మం జిల్లా లో ఈ అవినీతి తారస్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఇటువంటి మొక్కలు సరఫరా చేయడం పై ఖమ్మం నగరం లోని ఒక కార్పొరేటర్ ను అక్కడి వారు ప్రశ్నించగా నర్సరీ వారిని అడగండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి మెదలకుండా ఉండటం అనుమానాలు కు దారితీస్తోంది.విషయం టీమీడియా దృష్టికి రావడం తో విచారించగా..అధికారులు ఎవరు లేకుండానే మోకిక ఆదేశాలు మేరకు మొక్కలు సరఫరా నేరుగా డివిజన్లు కు జరుగుతున్నట్లు వెల్లడి అయింది.కార్పొరేటర్లు స్వయంగా వెళ్లకుండా అనుచరులను పంపటం జరుగుతోంది..మొక్కల లెక్కల లో కూడా భారీ గోల్మాల్ జరుగుతున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో అవినీతి జరుఫుతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఖర్చుతో డివిజన్ లకు సరఫరా చెయ్యాల్సి ఉండగా .అవిధం గా చెయ్యకుండా చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నట్లు తెలిసింది.
నర్సరీ వారి వివరణ
మేము సరఫరా చేసిన మొక్కలు పూర్తి నాణ్యమైనవి.దానవాయి గూడెం లో మా నర్సరీ ఉంది.15 డివిజనలకు సరఫరా చేసాం.ఎక్కడ కంప్లెయింట్ లేదు..కార్పొరేటర్,ఆర్పీ కి ఫోన్ చేసి వారు చెప్పిన వారికి మొక్కలు ఇవ్వమన్నారు ఇస్తున్నము.