పాఠశాలలో హరితహారం కార్యక్రమం

పాఠశాలలో హరితహారం కార్యక్రమం

1
TMedia (Telugu News) :

పాఠశాలలో హరితహారం కార్యక్రమం

టీ మీడియా, జూలై 9, వనపర్తి బ్యూరో : మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు.
జీవకోటికి మొక్కలు చెట్లే జీవనాధారం మనిషి మనుగడకు చెట్ల పెంపకం అనివార్యం మొక్కలు-చెట్లు లేని మనిషి జీవితం నిరర్థకంగా ఉంటుంది.
ఆకుకూరలు, కాయగూరలు పండ్లు-ఫలాలు లేని మానవ జీవితాన్ని ఊహించలేము.
మొక్కలు-చెట్ల నుండి లభించే ఆహారపదార్థాలే జంతుజాలం-పశు పక్ష్యాదులు , చరాచర జీవకోటికి మూలాధారం.అందుకే, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా , అందరి భాగస్వామ్యంతో పెద్దఎత్తున నిర్వహిస్తుంది.

 

Also Read : విద్యారంగాన్ని గాలికి వదిలిన ప్రభుత్వం

అందువల్ల, ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలు సేకరించడానికి, అజ్జకొల్లు పాఠశాల టీచర్లు గ్రామంలోని నర్సరీ ని సందర్శించి మొక్కలు తెచ్చి, ఉత్సాహంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతేగాక, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
1.రామ తులసి 2.ఉసిరికాయ
3.మునక్కాయల 4.దానిమ్మ.
లాంటి మొక్కలు నాటారు.
అజ్జకొల్లు ఉన్నత పాఠశాలలో, ఉపాధ్యాయులు మొక్కలు నాటి దత్తత తీసుకుని, వాటి సంరక్షణకు బాధ్యత తీసుకున్నారు.ఈ సందర్భంగా మొక్కల-చెట్ల ప్రాధాన్యత గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీ అతీఖ్ అహ్మద్ విద్యార్థులకు వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube