హర్యానా ఉపముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

హర్యానా ఉపముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

2
TMedia (Telugu News) :

హర్యానా ఉపముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

టీ మీడియా, డిసెంబర్ 20, న్యూఢిల్లీ : హర్యానాలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్‌ చౌతాలాకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌతాలా కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో దుశ్యంత్‌ చౌతాలాకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రమాదానికి గురైన వాహనంలోని ఒక కమెండోకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. దుశ్యంత్ చౌతాలా మంగళవారం తెల్లవారుజామున సిర్సా నుంచి హిస్సార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read : తాజ్‌మ‌హ‌ల్‌కు నోటీసులు.

దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపంచకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనానికి బదులుగా మరో వాహనాన్ని తీసుకుని డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ అక్కడి నుంచి వెళ్లినట్లు చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube