హష్‌ ఆయిల్‌ ఉత్పత్తి విశాఖ ఏజెన్సీ

నెల్లూరు కేంద్రంగా అక్రమ రవాణా

1
TMedia (Telugu News) :

హష్‌ ఆయిల్‌ ఉత్పత్తి విశాఖ ఏజెన్సీ

-నెల్లూరు కేంద్రంగా అక్రమ రవాణా

-హైదరాబాద్‌తో సిటీకి లింకులు

టి మీడియా,జూలై19,హైదరాబాద్‌: బెంగళూరులోని సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులకు ఇటీవల చిక్కిన హష్‌ ఆయిల్‌ అక్రమ రవాణా గ్యాంగ్‌ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బెంగళూరుతో పాటు సిటీకి లింకులు! చెన్నై, కొచ్చి, ముంబైలకు సరఫరా చేస్తోందని గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా మొత్తం నెల్లూరు కేంద్రంగా సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు. ఈ గ్యాంగ్‌ అరెస్టుపై ఇక్కడి అధికారులకు సమాచారం ఇచి్చన సీసీబీ నెల్లూరు కోణంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. బెంగళూరులోని వివిధ పబ్బుల్లో పని చేసే డిస్కో జాకీలకు (డీజే) పెద్ద ఎత్తున గంజాయి, హష్‌ ఆయిల్‌ సరఫరా అవుతున్నాయి. వీళ్లే తమ పబ్స్‌కు వచ్చే కస్టమర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అక్కడి సీసీబీ అధికారులకు గత నెల్లో సమాచారం అందింది. దీంతో వరుసపెట్టి దాడులు చేసిన అధికారులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీరికి ఈ మాదకద్రవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై సీసీబీ దృష్టి పెట్టింది. తమ దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముఠా అరకు లోయ నుంచితీసుకువచ్చి అందిస్తున్నట్లు గుర్తించింది. దీంతో నిఘా కొనసాగించిన సీసీబీ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు.

 

Also Read : 19 మంది కార్మికులు మిస్సింగ్‌

ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని, తొలిసారిగా పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్‌లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అరకు ప్రాంతానికి చెందిన వీరిని శ్రీనివాస్, ప్రహ్లాద్, సత్యవతి, మల్లీశ్వరిగా వీరిని గుర్తించారు. ఈ నలుగురినీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సీసీబీ లోతుగా విచారించింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోణం వెలుగులోకి వచి్చంది. ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతానికి చెందినదే. గంజాయి పండేది, హష్‌ ఆయిల్‌ ఉత్పత్తి అవుతున్నది సైతం ఆ ఏరియాలోనే. అయితే తమకు మాత్రం ఈ మాదకద్రవ్యాలను నెల్లూరులో ఓ వ్యక్తి అందించారంటూ ఈ నలుగురూ బయటపెట్టారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రేగా అనే వ్యక్తి ఆదేశాల మేరకు తాము అక్కడకు వెళ్లామని సీసీబీ విచారణలో చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తి గతంలోనూ తమకు గంజాయి, హష్‌ ఆయిల్‌ ఇచ్చాడని, వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాలకు తీసుకువెళ్లి డెలివరీ చేసి వచ్చాయని అంగీకరించారు. డెలివరీ ఎవరికి ఇవ్వాలనేది ముందుగా చెప్పరని ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే వాట్సాప్‌ కాల్‌ ద్వారా తమకు సమాచారం ఇస్తారని ఈ నలుగురూ సీసీబీ విచారణలో వెల్లడించారు. ఈ ముఠాకు హైదరాబాద్‌లోనూ పెడ్లర్లు ఉన్నారని తెలియడంతో సీసీబీ పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. నలుగురి వివరాలు, ఫోన్‌ నెంబర్లు అందించి స్థానిక లింకులపై ఆరా తీయాల్సిందిగా కోరారు. ఈ ముఠాకు, నెల్లూరులోని సరఫరాదారుడికి ఉన్న సంబంధాన్నీ తెలుసుకున ప్రయత్నాలు చేయాలని కోరారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ కోణంలో ఆరా తీయడం మొదలెట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube