మున్సిపల్ దుకాణ సముదాయాలకు దిక్కెవరు

-ప్రజాధనం వృధా అవుతున్న పట్టింపు లేని అధికారులు పాలకులు

2
TMedia (Telugu News) :

మున్సిపల్ దుకాణ సముదాయాలకు దిక్కెవరు.. ?

-ప్రజాధనం వృధా అవుతున్న పట్టింపు లేని అధికారులు పాలకులు

టీ మీడియా,సెప్టెంబర్ 11,గోదావరిఖని :

రామగుండం నగరపాలక సంస్థ, ఇక్కడ పాలకులకు ప్రజాధనంపై పట్టింపు లేదనడానికి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిదర్శనమని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఈస్ట్ ఏరియా కమిటీ కన్వీనర్ కో కన్వీనర్ కృష్ణ కుమార్,సురేష్ ఆదివారం మండిపడ్డారు.


ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాగర్ నాయకులు మాట్లాడుతూపారిశ్రామిక ప్రాంత ప్రజలు కడుతున్న పన్నులతో కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ దుకాణాల సముదాయము ఇక్కడి వ్యాపారస్తులకు అణువుగా ధరలు నిర్ణయించడంలో గతంలో ఉన్న పాలకులు గాని ప్రస్తుతం ఉన్న అధికారులు పాలకులు గాని పలుమార్లు ప్రయత్నాలు చేయకపోగా కాంప్లెక్స్ మొత్తం కూడా ఒక బూతు బంగ్లా లాగా మారుతుందని అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మరి మద్యం దుకాణంల తలపిస్తుందని వారు మండిపడ్డారు.

Also Read : ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కాంప్లెక్స్ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అవి నిరంతరం పనిచేయకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు కాంప్లెక్స్ లోపల జోరుగా జరుగుతున్నాయని వారి సందర్భంగా తెలియజేశారు. గతంలో నిర్మించిన రెండు అంతస్తులు పూర్తిగా వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకురాక ముందే ప్రస్తుతం ఉన్న అధికారులు పాలకులు అత్యుత్సాహంతో మూడు అంతస్తు నిర్మించడం అది పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం వల్ల బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా దొంగల పాలవుతుందన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులు వెంటనే స్పందించి వ్యాపారస్తులకు అనుగుణంగా ధరలు నిర్ణయించి మున్సిపల్ కాంప్లెక్స్ భవనాన్ని ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తేవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారి సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఏరియా కమిటీ సభ్యులు శివకుమార్,రాకేష్ పాల్గొన్నారు.

 

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube