అడపాదడపా ఉపవాసం ఉంటున్నారా?
లహరి, ఏప్రిల్ 17, ఆరోగ్యం : బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అడపాదడపా ఉపవాసం ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఈ డైటింగ్ ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. మీరు ఎప్పుడు తినొచ్చనే దానిపై పరిమితులు ఉన్నప్పటికీ.. మీరు ఏం తినాలనేదానిపై నియమాలు లేవు. అయినప్పటికీ.. ఉపవాసం సమయంలో మీ శరీరానికి శక్తిని ఇవ్వడానికి సరైన ఆహార పదార్థాలను తినాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
అవకాడోలు :
అవకాడోల్లో కేలరీల ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీనిలో అసంతృప్త కొవ్వు కంటెంట్ ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గేందుకు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 2017 నుంచి జరిపిన పరిశోధన ప్రకారం..అసంతృప్త కొవ్వులు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఉపవాసం ఉండేటప్పుడు మీకు ఆకలి అయినప్పటికీ.. మీ శరీరానికి మరీ ఎక్కువగా ఆకలి కానీయదు.
AlsoRead:పవిత్ర చార్ ధామ్ అనంతరం మరో యాత్ర ప్రారంభం.
క్రూసిఫరస్ కూరగాయలు :
బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫరస్ కూరగాయలు అడపాదడపా ఉపవాసం ఉన్నవారికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని ఫైబర్ ఆకలి బాధలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఉపవాస షెడ్యూల్ కు కట్టుబడి ఉండటం సులభం చేస్తుంది. అంతేకాక ఈ కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
బీన్స్, చిక్కుళ్లు :
బీన్స్, చిక్కుళ్లు అడపాదడపా ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమమైన ఆహారాలు. మీరు తినే వాటిలో బీన్స్, చిక్కుళ్లు వంటి తక్కువ కేలరీల పిండి పదార్థాలను చేర్చడం వల్ల మీ ఉపవాస సమయంలో మీరు శక్తివంతంగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే బ్లాక్ బీన్స్, చిక్పీస్, కాయధాన్యాలు, బఠానీలు వంటి ఆహారాలు కేలరీల పరిమితి లేకుండా కూడా శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే ఈ ఆహారాలను మీ అడపాదడపా ఉపవాసంలో చేర్చండి. ఇవి మిమ్మల్ని హెల్తీగా కూడా ఉంచుతాయి.