హెల్త్అసిస్టెంట్లను ఎప్పుడు పర్మినెంట్ చేస్తారు

జిల్లా నేత జయప్రకాష్

1
TMedia (Telugu News) :

హెల్త్అసిస్టెంట్లను ఎప్పుడు పర్మినెంట్ చేస్తారు

-జిల్లా నేత జయప్రకాష్

టి మీడియా, జూలై18, రాజోలి:తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ లను ఎప్పుడు పర్మినెంట్ చేస్తారు అని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ రాష్ట్ర ప్రభుత్వము ను సూటిగా ప్రశ్నించారు. గత ఇరవై ఏళ్ల నుంచి వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి కాలయాపన చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎంత కాలం మోసం చేస్తారని ఆయన అన్నారు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీ లో ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ ల క్రమబద్దికరణ కొరకు ఏప్రిల్ 4న తెలంగాణ రాష్ట్ర లోని అన్ని జిల్లాల నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉద్యోగుల యొక్క అన్ని వివరాల తో ప్రతిపాదనలు ప్రభుత్వము నకు పంపారనీ ఆయన అన్నారు. ఈ వివరాల్నీ డైరక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ లో పరిశీలించే భాద్యతలను డిప్యూటీ డైరెక్టర్ కు అప్పగించారని ఆయన అన్నారు.

 

 

Also Read : పొరపాటు న ముర్ముకు ఓటేసా

 

కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ ల సర్టిఫికేట్ లను స్క్రూటినీ పేరుతో గత నాలుగు నెలల నుండి కాలయాపన చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖమంత్రి హరీష్ రావు ను స్వయంగా హెల్త్ అసిస్టెంట్లందరు కలసి తమ గోడును విన్నవించారు అని ఆయన అన్నారు. మంత్రివర్యులు సంబధిత అధికారులను ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు ఇచ్చినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చాలా మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ లు పర్మినెంట్ కాక ముందే చనిపోయారని, ఇంకా కొంత మంది వయసు రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నిర్ హరీష్ రావు గారలు స్పందించి త్వరగా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ లను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు జయప్రకాశ్ కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube