ఉచితవైద్య శిబిరం విజయవంతం
టి మీడియా,జూలై23, జగిత్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావు పేట్ గ్రామంలో గ్రామసర్పంచ్ పునుగోటి కృష్ణారావు ఆధ్వర్యంలో సిగ్మా హాస్పిటల్ జగిత్యాల వారి ప్రోత్సాహంతో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
దాదాపు 250 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోగా వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది ఈ సందర్బంగా కృష్ణారావు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కావున వైరల్ ఫీవర్ లు వస్తాయని ప్రజలు తగుజాగ్రత్తలు పాటించాలని పరిసరాలను పరిశుబ్రంగ ఉంచుకోవాలని వేడి ఆహారాన్ని తీసుకోవాలనీ తెలిపారుకాగా గ్రామప్రజలు కృష్ణారావు కు హాస్పిటల్ సిబ్బంది కి ధన్యవాదములు తెలిపారు .
Also Read : జవాబుదారితనంతో విధులను నిర్వర్తించాలి
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనుగోటి కృష్ణా రావు , సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్ టీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు ఎండీ అక్బర్, నాయకులు ఆకునూరి మల్లయ్య, కుంటూరి మహేష్,శ్రీధర్, వేణు రావు, ఎన్డ్రికాయల శ్రీను, అనిల్ వార్డు సభ్యులు పంచాయితీ కార్యదర్శి పావని,గ్రామప్రజలు
డాక్టర్ అఫ్రోజ్, సిగ్మా హాస్పిటల్
మేనేజర్ గణేష్,
క్యాంప్ ఇంఛార్జ్ షవర్
వైద్య సిబ్బంది పాల్గొన్నారు.