ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరం

1
TMedia (Telugu News) :

ఉచిత వైద్య శిబిరం.

టీ మీడియా, జూలై 25, మహానంది:

మహానంది మండల పరిధిలోని అబ్బిపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 300మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలు వినియోగించుకున్నారు. నంద్యాల పట్టణంలోని టూరిస్ట్ హోటల్ ఎదురుగా ఉన్న బాలాజీ హాస్పిటల్ చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో కొనసాగింది. ఇందులో ఆర్థోపెటిక్ వైద్యనిపుణులు బాలాజీ ఓబుల్ రెడ్డి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ సి.ఓబులరెడ్డి, డాక్టర్ కె హరిప్రియ పాల్గొన్నారు. గ్రామస్తులకు ఉచితంగా ఎముకలు, కీళ్లకు సంబంధించి, కంటికి సంబంధించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు .

 

Also Read n: అన్నప్రసాద వితరణకు విరాళం

అంతేగాక ఉచితంగా మందులను పంపిణీ చేశారు .తమ గ్రామానికి వచ్చి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు సర్పంచ్ శవ్వా శ్రీలక్ష్మి ,వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ శరబా రెడ్డి దంపతులు వైద్యులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక గ్రామ ప్రజలు కూడా వైద్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు కెవిఆర్ మహేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండలంనాయకులు నాగేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube