గుండె మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

విలేకరుల సమావేశంలో వైద్యులు

1
TMedia (Telugu News) :

గుండె మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

-విలేకరుల సమావేశంలో వైద్యులు

టి మీడియా,అక్టోబర్ 17,ఖమ్మం : మీ హృదయం మా చేతుల్లోనే పదిలంగా ఉండేవిధంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించేవిధంగా ప్రసూన ఆసుపత్రి కార్డియాలజిస్టు వైద్యులు శశివర్థన్ జంజీరాల, బాల భాస్కర్రెడ్డి, జి. వెంకటేశ్వర్లు (జివిఆర్), కిషోర్కుమారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నెహ్రూ నగర్లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నున్న ప్రసూన ఆసుపత్రి కార్డియాక్, సూపర్ స్పెషాలిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉచిత గుండె మెగా వైద్య శిబిరాన్ని మూడు రోజుల పాటు నిర్వహించామని ఈ వైద్య శిబిరానికి సుమారు 250 మంది గుండె సంబంధిత పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు.

Also Read : తెగిపడినహెవీ కరెంట్ వైరు

వారికి గుండె సంబంధిత వైద్యులు పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆసుపత్రి ఆధ్వర్యంలో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ వంటి మహానగరాలకు ధీటుగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు వారు తెలిపారు . ఈ వైద్యశిబిరంలో బిపి , షుగర్ , క్రియాటినైన్ , 2డిఎకో , లిపిడ్ ప్రొఫైల్ , ఈసిజి పరీక్షలను నిర్వహించి వైద్య సేవలను అందించామని తెలిపారు . ఈ అవకాశాన్ని ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని గుండె సంబంధిత వ్యాధి -రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube