ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

2
TMedia (Telugu News) :

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
టి మీడియా,మే 5,పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణంలో రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని మంత్రి పరిశీలించారు. ప్రజలకు సేవలు అందించేందుకు సంపూర్ణంగా వినియోగించాలని మంత్రి సూచించారు. 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన టీ-డయాగ్నిస్టిక్ కేంద్ర నిర్మాణ పనులకు, నూతన మార్చురీ నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

Also Read : పోరాటాలకు స్పందించిన అధికారులు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, ఈద శంకర్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డిసిహెచ్ డాక్టర్ వాసుదేవరెడ్డి, పెద్దపల్లి హాస్పిటల్ మెడికల్ సుపరెండెంట్ రమాకాంత్, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube