కావ్య హాస్పిటల్ లో హెల్త్ చెకప్ క్యాంప్

కావ్య హాస్పిటల్ లో హెల్త్ చెకప్ క్యాంప్

1
TMedia (Telugu News) :

కావ్య హాస్పిటల్ లో హెల్త్ చెకప్ క్యాంప్
టి మీడియా,జూలై18,ఖమ్మం:ఆధునిక పరికరాలతో గత రెండు రోజులనుండి ఖమ్మం కావ్య హాస్పిటల్లో ప్రివెంటివ్ వెల్నెస్ కంప్లీట్ హెల్త్ చెకప్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించాము అని కావ్య హాస్పిటల్ డాక్టర్ కావ్యచంద్ యలమూడి తెలిపారు . దీనిలో భాగంగా అన్ని బాడీ చెకప్ , షుగర్ పరీక్షలు , హార్మోన్ పరీక్షలు , విటమిన్ పరీక్షలు మరియు మెటబాలిక్ ప్రొఫైల్లతో కూడిన పరీక్షలను చేయటం జరిగిందని . చుట్టుపక్కల పరిసరాలు ప్రాంతల నుండి దాదాపు రెండొందల మంది ప్రజలు చూపించుకుని విజయవంతం చేశారని పేర్కొన్నారు .

 

Also Read ; విద్యార్థి కి సన్మానం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపధ్యంలో మరియు సిజన్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థితిని మరియు మంచి ఆరోగ్యంతో ఉండటానికి 3 నెలలకు ఒకసారి ప్రివెంటివ్ వెల్నెస్ కంప్లీట్ హెల్త్ చెకప్ ను చేయించుకోవాలని సూచించారు . కావ్య హాస్పిటల్లో ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కొరకు 24*7 ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తు , మెరుగైన ఆరోగ్యం కోసం పని చేస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యలమూడి , చీఫ్ ఆపరేషన్స్ ప్రసూన పారుపల్లి మరియు హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube