హెచ్. ఐ. వి.బాధిత చిన్నారులకు

పోషకాహార వితరణ:-

1
TMedia (Telugu News) :

హెచ్. ఐ. వి.బాధిత చిన్నారులకు పోషకాహార వితరణ:-
హరిక,దేవేందర్ దంపతుల దాతృత్వం
టిమీడియా, మార్చి2,అమలాపురం రూరల్ :బండివారి పేట ఏరియాకు చెందిన పోతురాజు హరిక,దేవేందర్ దంపతుల దాతృత్వం హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత చిన్నారులకు ఒక సంవత్సరం పాటు పోషకాహారాని వితరణ ఇవ్వడానికి ముందుకు వచ్చి తమ దాతృత్వం చాటుకునారు ఈ సందర్బంగా తమ స్వగృహం నందు ఏర్పాటుచేసి పోషకాహారం వితరణ కార్యక్రమంలో జనకళ్యాణ్ సంస్థ వారు బాధిత చిన్నారులకు గురించి తనను సంప్రదించినపుడు ఒక్క 10మంది పిల్లలకు తమ కుమారై హరిక దంపతులు ముందుకు వచ్చి ఒక్క సంవత్సరం పాటు పోషకాహారి వితరణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించామని ఇది ప్రతి నెల క్రమం తప్పకుండా వితరణ ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది.

ALSO READ: త‌ల‌స‌రి వృద్ది రేటు

 

ఇందులో భాగంగా అమలాపురం ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ సుప్రియ పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జనకళ్యాణ్ సంస్థ అమలాపురం టీ.ఐ. ప్రాజెక్టు మేనేజర్ జి.శ్రీను, మాట్లాడుతూ అమాలపురంలో సుమారు 143 మంది హెచ్ఐవి /ఎయిడ్స్ తో జీవిస్తున్నారు వీరికీ ప్రభుత్వం ప్రతి నెల ఉచితంగా ఏ ఆర్టీ మందులు ఇస్తుంది అయితే మందులతో పాటు వీరికి బలవర్ధకమైన ఆహారం చాలా అవసరం అని ఏ ఆర్టీ మందులు వాడుతున 143 మంది చిన్నారులో చాలామంది అంత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు

ALSO READ:  ఉక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్త‌పాతం

 

మరియు తల్లిదండ్రులను కోల్పోయిన వారు సింగిల్ పేరెంట్స ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారని వారిని పోషకాహారం ,విద్య,వైద్యం చాలా అవసరమై ఉన్నవి అని ఈ విషయంలో అంత్యంత నిస్సహాయక స్థితిలో ఉన్న 10మంది పిల్లలకు పోషకాహారాని వితరణ ఇవ్వడానికి ముందుకు వచ్చిన జల్లి సుజాత గారు అబినందనీయులు అని దాతలు ఎవరైనా హెచ్ఐవి బాధిత చిన్నారులకు వితరణ ఇవ్వడానికి ముందుకు వస్తే ఈదరపలి హనుమాన్ ధియేటర్ ఏరియాలో ఉన్న తమ సంస్థ కాని లేద అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఏ ఆర్టీ సెంటర్ నందు సంప్రదించి బాధిత చిన్నారులకు ఆరోగ్య పరిరక్షణ మరియు సామాజిక భద్రత సహాయ సహకారాలు అదించగలరని ఈ సందర్బంగా విన్న వించుకోవడం జరిగింది ఈ కార్య క్రమంలో జనకళ్యాణ్ టీఐ సాఫ్ట్ వెంకటరమణ, అమల ఛైల్డ్ కేర్ ఫెసిలీటర్స ఏడుకొండలు ,బాలా త్రిపుర సుందరి ,అమలాపురం ఏరియా ఆసుపత్రి డిఎస్ ఆర్స్ కౌన్సిలర్ జి. సుజాత తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube