మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే..

మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే..

0
TMedia (Telugu News) :

మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే..

లహరి, ఫిబ్రవరి 7, ఆరోగ్యం : ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యం తప్పనిసరి. రోజువారీ జీవితంలో పని ఒత్తిడికి కారణంగా అలసిపోతారు. అందుకే మీ శరీరానికి ఈ రకమైన విశ్రాంతి అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్య సమస్యలు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారంలో మార్పులు తదితర కారణాల వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

ఆధ్యాత్మిక రిలాక్సేషన్: జీవితంలో ఎన్నో టెన్షన్స్‌ ఉంటాయి. వాటి నుంచి బయటపడే మార్గాలను వెతుక్కోవాలి. మనశ్శాంతికి ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనండి. అది దేవుని ధ్యానం కావచ్చు , ఇంకేదైనా కావచ్చు.
పెయింటింగ్‌ వేయండి: పెయింటింగ్, సంగీతం వినడం లేదా చదవడం వంటివి చేయండి. మానసిక రోగ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. సొంత మార్గాన్ని ఎంచుకోండి: సమాజంతో జీవిస్తున్నప్పుడు కొంత ఒత్తిడి వస్తుంది. దాని నుండి బయటపడండి. మీ స్వంత మార్గాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు నడక, పుస్తకం చదవడం మొదలైనవి.

Also Read : విజయ ఏకాదశి ప్రత్యేకతలేంటో..

ఎమోషనల్ రిలాక్సేషన్: ప్రతి వ్యక్తి మానసికంగా ప్రవర్తించడం సహజం. కానీ భావోద్వేగాలను నిలుపుదల చేయడం ఒత్తిడికి, ఆందోళనకు దారితీస్తుంది. తరచుగా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలవండి. మీ భావాలను పంచుకోండి. దీని వల్ల మనసికంగా ప్రశాంతత లభిస్తుంది.
మానసిక ఆరోగ్యం: రోజువారీ కార్యకలాపాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకు యోగా, ప్రాణాయామం మంచి సాధన.
శారీరక విశ్రాంతి: ఎంత శ్రమించినా శరీరానికి విశ్రాంతి అవసరం. కాబట్టి నిద్రపోవడం మంచి అలవాటు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube