ఫ్రూట్స్‌, జ్యూస్‌లు ఏవి ఆరోగ్యానికి మంచిది?

ఫ్రూట్స్‌, జ్యూస్‌లు ఏవి ఆరోగ్యానికి మంచిది?

0
TMedia (Telugu News) :

ఫ్రూట్స్‌, జ్యూస్‌లు ఏవి ఆరోగ్యానికి మంచిది?

లహరి, ఫిబ్రవరి 13, ఆరోగ్యం : ఫ్రూట్స్‌ తింటే మంచిదా? లేక జ్యూస్‌లా? వీటిల్లో ఆరోగ్యానికి ఏవి మేలు చేస్తాయి? వంటి ప్రశ్నలకు వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందామా..- పండ్లు, జ్యూస్‌లు ఏవైనా ఆరోగ్యానికి మంచిదే అని వైద్యులు చెబుతున్నారు. తాజా పండ్లను తీసుకుంటే అజీర్తి సమస్యను నియంత్రించుకోవచ్చు. పండ్లను కాకుండా జ్యూస్‌ తాగినా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్యూస్‌లు అధిక బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఫ్రూట్స్‌, జ్యూస్‌లు ఏవైనా సరే.. రోజూ తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
– ఫ్రూట్స్‌లో న్యూట్రియంట్స్‌, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. జ్యూస్‌ల్ని ప్రత్యేకంగా షుగర్‌ని కలిపి తయారుచేస్తారు. వీటిని తాగిన తర్వాత కొద్దిసేపటివరకు వేటినీ తినలేరు. దీంతో అధిక బరువు ఉన్నవారు వీటిని రోజూ తాగితే.. వారు బరువు తగ్గేందుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు అంటున్నారు. ఫ్రూట్స్‌తోపాటు, జ్యూస్‌ల్లో చక్కెరను కలపడం వల్ల షుగర్‌స్థాయిలు పెరిగే అవకాశముంది. అందుకే మధుమేహస్తులు జ్యూస్‌లు తాగాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read : ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు..?

– మీరు రోజూ ఒక్క ఫ్రూట్‌తోనే లేక.. రెండు మూడు రకాల పండ్లను కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదిదే. కానీ ఫ్రెష్‌ జ్యూస్‌ తాగాలనుకునేవారు చక్కెరని కలపకుండా తాగితే ఆరోగ్యానికెంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఫ్రూట్‌ సలాడ్‌ని కూడా మీ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్యాలు దరికి చేరవని డాక్టర్లు చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube