నిద్రించే ముందు మీ తల దగ్గర ఈ వస్తువులను ఉంచుకుంటే..

నిద్రించే ముందు మీ తల దగ్గర ఈ వస్తువులను ఉంచుకుంటే..

0
TMedia (Telugu News) :

నిద్రించే ముందు మీ తల దగ్గర ఈ వస్తువులను ఉంచుకుంటే..

లహరి, ఫిబ్రవరి 16, ఆరోగ్యం : ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగులతోనే జీవితాన్ని గడుపుతున్నారు. అయితే మన జీవన విధానంలో నిద్రకు సరైన సమయం తప్పక కేటాయించాలి. ఎందుకంటే నిద్ర అనేది సరిగా లేకపోతే మన దైనందిన జీవితంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. మన బాడీకి కావాల్సిన రెస్ట్ దొరకకపోతే మనం చేసే పనులపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వాస్తు శాస్త్రం ప్రకారం, మనం నిద్రపోయే విధానం.. నిద్రా భంగిమలు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా మనం నిద్రించే ముందు తల ఏ దిశలో ఉంచుకోవాలి.. తలగడ దగ్గర ఎలాంటి వస్తువులను ఉంచుకుంటే.. ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

పవిత్రమైన పుస్తకాలను..
వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి పూట మీరు నిద్ర పోయే సమయంలో అందమైన కలలు రావాలంటే.. మంచి ఆలోచనలు కావాలని కోరుకునేవారంతా పవిత్రమైన పుస్తకాలను మీ తల దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాదు పీడ కలల ప్రభావం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత మేరకు మీరు పడుకునే సమయంలో తల దగ్గర భగవద్గీతను పెట్టుకుంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

Also Read : మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

బెడ్ దగ్గర్లో పువ్వులను..
వాస్తు శాస్త్రం ప్రకారం, మనం నిద్రించే సమయంలో మంచం(bed) దగ్గర సువాసన వెదజల్లే పువ్వులను ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సానుకూల శక్తుల ప్రభావం పెరుగుతుంది. మీకు ప్రశాంతత లభిస్తుంది. ఈ కారణంగా మీకు మానసిక ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పీడకలలు రాకుండా..
కొందరు వ్యక్తులు నిద్రలోకి జారుకున్న కాసేపటికే పీడకలలతో బాగా ఇబ్బంది పడుతుంటారు. దీంతో నిద్రలోంచి ఒక్కసారిగా మెళకువ వస్తుంది. ఆ తర్వాత సరిగా నిద్ర పట్టదు. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం, నిద్ర పోయే సమయంలో మీ మంచం దగ్గర ఒక ఇనుప వస్తువును ఉంచాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది.

ప్రశాంతమైన నిద్ర కోసం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొందరు వ్యక్తులకు జాతకంలో ఉండే దోషాల వల్ల సరైన సమయానికి నిద్ర పట్టదు. ఒకవేళ నిద్రపోయిన ఏవైనా చెడు కలలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో సరైన నిద్ర కోసం మీరు నిద్రించే గదిలో జంతువులు, యుద్ధానికి సంబంధించిన ఫొటోలను తొలగించండి. వీటి వల్ల మీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీ గదిలో ఎల్లప్పుడూ అందమైన, ప్రకృతి సంబంధిత ఫొటోలను ఉంచండి.

తలను ఏ దిశలో ఉంచాలంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిక్కుకు దేవతల రాజు ఇంద్రుడు అధిపతిగా ఉంటాడని భావిస్తారు. అందుకే మీరు నిద్రించే సమయంలో మీ తలను తూర్పు దిశలో ఉంచి నిద్రించి.. ఉదయాన్నే ఈ దిక్కుకు చూడటం వల్ల మీకు దేవేంద్రుని ఆశీస్సులు లభించడంతో పాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. అయితే ఈ దిక్కున ఎట్టి పరిస్థితుల్లో కాళ్లు పెట్టి నిద్రపోవద్దు. దీని వల్ల మీకు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read : బుగ్గపాడు ఫుడ్ పార్క్ పూర్తికి కేటీఆర్ హామి

ఈ రెండు దిశల్లోనూ..
వాస్తు శాస్త్రం ప్రకారం, పడమర దిశలో తలను చేసి నిద్రించడం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. అంతేకాదు సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు, శ్రేయస్సు పెరుగుతాయి. అదే విధంగా దక్షిణ దిశలో తలను పెట్టి నిద్రించడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. అంతేకాదు హాయిగా నిద్రపోతారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube