టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?

0
TMedia (Telugu News) :

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?

లహరి, పిబ్రవరి 25, ఆరోగ్యం :  చాలామందికి టీ తాగిన తర్వాత వెంటనే నీటిని తాగే అలవాటుంటుంది. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎందుకు హానికరమో… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందామా..!
డీహైడ్రేషన్‌: టీలో కెఫిన్‌ ఉంటుంది. అందుకే చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. ఒక కప్పు టీలో 50 ఎం.జి కెఫిన్‌ ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఇది దాహాన్ని పెంచుతుంది.జీర్ణ సమస్య: టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే.. అసిడిటీ లేదా కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయని చాలామంది భావిస్తారు.
దంతాలు దెబ్బతింటాయి : దంత సమస్యలు ఉన్నవారికి వేడి వేడిగా ఉండే ఆహార పానీయాలు గానీ… చల్లగా ఉన్న పానీయాలు గానీ తీసుకుంటే దంతాలపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. వేడివిగానీ, చల్లటివిగానీ తీసుకుంటే నోటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు సంభవించి పంటి నరాలు దెబ్బతింటాయని, దంతాలలో జలదరింపును కలిగిస్తుందని వైద్యులు తెలిపారు.అల్సర్‌ : టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్‌ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరికి టీ తాగగానే కడుపులో గ్యాస్‌ వస్తుంది. దీన్ని తగ్గించడానికి, ఎక్కువ నీరు త్రాగాలి.రక్తస్రావం : టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తం కారుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చలి లేదా వేడి రెండింటినీ ఒకేసారి తట్టుకోలేదు.

Also Read : ఉదయాన్నే ప్రోటీన్లతో నిండి ఉండే టిఫిన్

వాతావరణానికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఎండాకాలంలో నీళ్లు తాగిన తర్వాత టీ తాగితే ముక్కుద్వారా రక్తస్రావమయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గొంతు నొప్పి : వేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు. టీ తాగిన అరగంట తర్వాత మాత్రమే నీరు త్రాగాలి. అప్పుడే మీకు ఎలాంటి సమస్యలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube