ఈ జ్యూస్ రోజుకో గ్లాస్ తాగారంటే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
ఈ జ్యూస్ రోజుకో గ్లాస్ తాగారంటే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
ఈ జ్యూస్ రోజుకో గ్లాస్ తాగారంటే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
లహరి, ఫిబ్రవరి 28, ఆరోగ్యం : నేటి జీవన శైలి, ఆహార అలవాట్ల వల్ల వయసుతో సంబంధంలేకుండా అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్, షుగర్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆజన్మాంతం మందులు వాడుకోవల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉబకాయం అన్ని సమస్యలకు మూలకారణం. శరీరంలో కొవ్వు పేరుకుపోయి, గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. లక్షలాది డబ్బు ఆసుపత్రులపాలు చేస్తూ వైద్యుల చుట్టూ తిరుగుతుంటారు. నిజానికి శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిల్లో ఉసిరి-అర్జున జ్యూస్‌ను ప్రతి రోజూ ఓ గ్లాస్ తాగారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుందట. ఎలా తయారు చేసుకోవాలంటే.. ఉసిరి కాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి దాని నుంచి రసం వయకట్టుకోవాలి. తర్వాత ఓ పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే అర్జున చెట్టు బెరడు ముక్కను అందులో వేసి మరిగించాలి. తర్వాత చల్లారనిచ్చి వడకట్టుకుని ఓ బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ రసాన్ని గోరువెచ్చని నీళ్లలో కలుపుని, రుచి కోసం దానిలో కొంచెం తేనె కూడా కలుపుని తాగవచ్చు.
Also Read : చార్‌ధామ్ యాత్రలో వీఐపీలకు ఝలక్
ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొవ్వు వేగంగా కరుగుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటి, మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ జ్యూస్ తక్కువ టైంలోనే మన చర్మానికి రంగు వచ్చేలా చేస్తుంది. చర్మాన్ని శుభ్ర పరచి మెరుపు రావడానికి కారణమవుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంచే లక్షణం ఉసిరికి ఉంటుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube