లోబీపీతో ఇబ్బందా..? ఇదిగో టిప్స్‌ మీ కోసం..

లోబీపీతో ఇబ్బందా..? ఇదిగో టిప్స్‌ మీ కోసం..

1
TMedia (Telugu News) :

లోబీపీతో ఇబ్బందా..? ఇదిగో టిప్స్‌ మీ కోసం..
|
టీ మీడియా, బ్యూరో : మనం ఏదైనా ఆరోగ్య సమస్యతో దవాఖానకు వెళ్లగానే ముందుగా మనకు రక్తపోటు చెక్‌ చేస్తుంటారు. నిజమే కదూ..! అంటే మన శరీర అవయవాలకు రక్తం సరఫరా ఎలా జరుగుతుందనేది తెలుసుకుంటారు. రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఆరోగ్యంగా లేకపోతే రక్తం సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. దీనినే బ్లడ్ ప్రెజర్‌ అంటుంటాం. అంటే శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం చేసుకోవాలి. బ్లడ్‌ ప్రెజర్‌.. లోబీపీ, హైబీపీగా ఉంటాయి. ఈ రెండూ మనల్ని ఇబ్బందిపెడతాయి.

నార్మల్ బీపీ అంటే వ్యక్తుల సిస్టోలిక్ ప్రెజర్ 90 mm Hg కంటే ఎక్కువ, 120 mm Hg కంటే తక్కువగా ఉండాలి. డయాస్టోలిక్‌ ప్రెజర్ 60 mm Hg కంటే ఎక్కువ, 80 mm Hg కంటే తక్కువ ఉండాలి. పెద్దలకు నార్మల్ బీపీ రీడింగ్ 120/80 mm Hg కంటే తక్కువగా, 90/60 mm Hg కంటే ఎక్కువగా ఉండాలి. డయాస్టోలిక్ ప్రెజర్ 95 mm Hg, సిస్టోలిక్ 140 mm Hg మించకూడదు. అయితే, మహిళల్లో 60/100 , పురుషుల్లో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్టుగా అనుమానించాలి.

 

Also Read : చెమట విపరీతంగా వస్తుందా?

లోబీపీ కారణాలు..
గుండెలో సమస్యలు, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సీవియర్‌ ఇన్ఫెక్షన్‌, డీహైడ్రేషన్‌, పోషకాహార లోపం, సెప్టిక్‌ షాక్‌, ఎండోక్రైన్‌ వ్యవస్థలో సమస్యల కారణంగా లోబీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

లోబీపీ లక్షణాలు..

కూర్చొని ఉండి ఒక్కసారిగా పైకి లేవగానే తల దిమ్ముగా అనిపిస్తుంది.
కళ్లు మసకగ్గా అవుతాయి.
శ్వాస వేగంగా నిస్సారంగా మారిపోతుంది.
అలసిపోవడం కనిపిస్తుంది.
ఎక్కువ సేపు పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుంది.
తలనొప్పి , వికారం కనిపిస్తుంది.
అప్పడప్పుడు మూర్ఛ కూడా వస్తుంది.
చర్మం చల్లగా, బంకగా మారుతుంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎక్కువ రక్తస్రావం కూడా లోబీపీకి దారితీస్తుంది.
కొన్ని రకాల ఔషధాలు సైడ్‌ ఎఫెక్టుతో కూడా వస్తుంది.
లోబీపీతో ప్రమాదాలు..

 

Also Read : అనంతం.. పద్మనాభ అనుగ్రహం!

స్ట్రోక్‌, గుండెపోటు, మూత్రపిండాలు చెడిపోతుంటాయి.
కొత్తగా మూర్చ కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది.
మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు పోయే అవకాశాలు మెండుగా ఉంటాయి.
లోబీపీ కంట్రోలింగ్‌ ఇలా..

లోబీపీని కంట్రోల్‌లో పెట్టేందుకు ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
ఆకలితో ఉండకుండా చూసుకోవాలి.
రక్తంలో చక్కెర స్థాయి పడిపోకుండా ఆహారాలు తీసుకోవాలి.
లోబీపీగా తోయగానే నిమ్మరసం తాగాలి.
చాక్లెట్‌ తినడం కూడా మంచిదే.
గ్లాసెడు నీటిలో చక్కెర, ఉప్పు వేసి కలిపి తాగడం ద్వారా కూడా లోబీపీని నార్మల్‌గా చేసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు బీపీని చెక్‌ చేస్తుండాలి.
రోజంతా ఎక్కువ మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
మద్యం సేవించడం మానుకోవాలి.
ఒకేసారి కింది నుంచి పైకి లేవకుండా చూసుకోవాలి.
ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పును జోడించాలి.
వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లను తినడం మానుకోవాలి.
తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న చిన్న భోజనం తినాలి.
మీల్స్‌ ప్లేట్‌ను విటమిన్లు, ఖనిజాలతో నింపాలి.
చివరగా, లోబీపీని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఒక్కోసారి ఇది ప్రాణాల మీదకు తెస్తుందని గ్రహించాలి. ముఖ్యంగా మహిళలు దీని భారిన ఎక్కువగా పడుతుంటారు. అందుకని లోబీపీని అశ్రద్ధ చేయకుండా వైద్యం తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube