వేసవిలో సపోటా ఎంతో మేలు.. తింటే అద్భుత ప్రయోజనాలు..

వేసవిలో సపోటా ఎంతో మేలు.. తింటే అద్భుత ప్రయోజనాలు..

0
TMedia (Telugu News) :

వేసవిలో సపోటా ఎంతో మేలు.. తింటే అద్భుత ప్రయోజనాలు..

లహరి, మార్చి 3, ఆరోగ్యం : వేసవి కాలం ప్రారంభమవడంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక ఈ వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి, పనస పండ్ల మాదిరిగానే సపోటాలో కూడా చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక రోగాలను నయం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సపోటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిలోని క్యాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.

శిరోజాలకు కూడా సపోటా తగిన పోషణను అందిస్తుంది. అంతే కాకుండా దీనిని తరచుగా తింటే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటాలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది. సన్ బర్న్స్ నుండి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. సపోటాలో ఉండే కాపర్, ఫాస్ఫరస్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సపోటా శరీరంలో ఉన్న హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, అడ్రినల్ గ్రంధులు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

Also Read : భోజనం తర్వాత మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు..

వేసవిలో సపోటా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు:
సపోటా పండులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాల్షియంతో పాటు మెగ్నిషియం, పొటాషియం, జింక్‌, కాపర్‌, పాస్పరస్‌, సెలినియం వంటి మినరల్స్‌ కూడా సపోటాలో అధికంగా ఉంటాయి.
రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లు తింటే పిల్లలకు, పెద్దలకు ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారిలోను, టెన్షన్ వర్క్స్ చేసేవారు సపోటాను తింటే అలసట వెంటనే తగ్గుతుందని.. కొత్త ఉత్సాహం కూడా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగుదలకు ఉపయోగపడే ఎ, బి, సి విటమిన్లు ఉంటాయి. సపోటా పండ్లను తరచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.
సపోటాలో రక్తవృద్ధి, దాతుపుష్ఠిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇవి మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివర ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి.
రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్దులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

Also Read : హోలీకి ముందే ఈ వస్తువులు బయట పడెయ్యండి.

సపోటా పండులో చర్మ, జుట్టు సమస్యలను నివారించి, సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే గుణం కూడా కలిగి ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని హానికారకాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతల నివారిస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్‌ సిండ్రోమ్‌ నివారణకు, మలబద్ధకం సమస్య పరిష్కారానికి దీనిలో ఫైబర్‌ గుణాలు ఉపకరిస్తాయి.
ఖర్జూరాలను సపోటాల్లో చేర్చి జ్యూస్‌ రూపంలో తీసుకున్నా.. లేదంటే సపోటాను నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మెగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
సపోటాలో ఉండే ప్రక్టోజ్ వల్ల శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. సపోటా హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని నివారిస్తుంది. క్రమం తప్పకుండా వేసవి కాలం ఈ సపోటా జ్యూస్ తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube