టీ పదేపదే వేడి చేసి తాగుతున్నారా.?
లహరి, నవంబర్ 11, ఆరోగ్యం : రోజులో రెండు మూడుసార్లు టీ తాగే వారు ఉన్నారు. అందులో కొంతమంది ఒకేసారి టీని ఎక్కువ తయారుచేసుకుని స్టోర్ చేసుకుంటారు. తాగే ముందు మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. కానీ ఇలా టీని పదే పదే వేడి చేసుకుని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే టీని తాజాగా అప్పటికప్పుడు కాచుకొని తాగితేనే ఆ ఫ్లేవర్ శరీరంలో చక్కగా పనిచేస్తుంది. టీని చేశాక నాలుగు గంటల్లోపు తాగేయాలి. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగడం వల్ల ఉపయోగం ఉండదు. అప్పటికే టీలో బ్యాక్టీరియా చేరడం మొదలైపోతుంది. ఆ బ్యాక్టీరియాను మళ్ళీ వేడి చేసి దాన్ని టీలో కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీరే ఆలోచించండి.
తయారుచేసి ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది. ఆ ఫంగస్ బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. దాని టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి దీన్ని మళ్లీ మళ్లీ వేడి చేసుకొని తాగడం మానేయండి. టీలో ఉండే పోషకాలు, ఖనిజాలు అన్నీ నశించిపోతాయి కూడా. అలాంటి టీ తాగడం వల్ల పొట్ట అప్‌సెట్ అవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే హెర్బల్ టీ వంటివి చేసిన వెంటనే తాగేయాలి. వాటిని దాచుకొని మళ్ళీ వేడి చేసి తాగడం వంటివి చేయకూడదు. గ్రీన్ టీ వంటివి మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వల్ల అందులో టానిన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఆ టానిన్లు మన శరీరంలో చేరితే చాలా డేంజర్. అంతేకాదు టీ కూడా చేదుగా మారిపోతుంది. అలాంటి టీ తాగడం వల్ల కడుపునొప్పి రావడం, కడుపులో తిప్పినట్టు అవ్వడం, వికారం, విరోచనాలు, కడుపు ఉబ్బినట్టు అవ్వడం జరుగుతుంది. కాబట్టి టీ ని తాగాలనుకున్నప్పుడే చేసుకుని ఫ్రెష్ గా సేవించండి.
Also Read : తలస్నానం చేసేప్పుడు ఆ తప్పులు చేస్తే.?
అంతే తప్ప ఒకేసారి ఎక్కువ చేసుకొని, తాగే ముందు మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవడం మానేయండి. టీ తాగడం వల్ల ఉల్లాసం, ఉత్సాహం వంటివి కలుగుతాయి. చురుగ్గా కూడా ఉంటారు. కానీ బ్యాక్టీరియా, ఫంగస్ చేరిన టీ ని వేడి చేసుకుని తాగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. టీని రోజులో రెండు సార్లు మాత్రమే తాగాలి. అధికంగా తాగితే ఇతర సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది. టీని పరిమితంగా తాగితే చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటుంది. వేడి వేడి తాజా టీ తాగడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో టీ ముందుంటుంది. అజీర్తి సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube