మీ తలనొప్పికి కారణం ఇదేనట

-వీటికి దూరంగా ఉండండి

1
TMedia (Telugu News) :

మీ తలనొప్పికి కారణం ఇదేనట

-వీటికి దూరంగా ఉండండి

లహరి ,నవంబరు 28, ఆరోగ్యము: అవును, ఇది మీరు నమ్మాలి. మనం రోజూ తినే ఆహారం వల్ల తలనొప్పి వస్తుంది. కాబట్టి మనం ఇలాంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మీకు ఏవైనా తరచుగా మైగ్రేన్ లక్షణాలు కనిపిస్తే, వెంటనేనేడు చాలా మంది దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడుతున్నారు. దీనికి ఒత్తిడి ప్రధాన కారణమని తెలిసింది. అయితే నమ్మినా నమ్మకపోయినా మనం రోజూ తినే ఆహారాలు కూడాతలనొప్పికికారణమవుతాయి. అవును, ఇది మీరు నమ్మాలి. మనం రోజూ తినే ఆహారం వల్ల తలనొప్పి వస్తుంది. కాబట్టి మనం ఇలాంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మీకు ఏవైనా తరచుగా మైగ్రేన్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించండి. తగిన టెస్టులు చేయించుకోండి.

మీరు పోషకాహార నిపుణుడి సలహా కూడా తీసుకోవాలి. జీవనశైలి, ఆహారంలో మార్పు తలనొప్పికి దారితీస్తుంది. దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటారో తెలుసుకోవాలి.తలనొప్పిని కలిగించే 7 ఆహారాలు జున్ను: ఇందులో టైరమైన్ ఉంటుంది. ఇది రక్త నాళాలను కుదించడం ద్వారా తలనొప్పికి కారణమవుతుంది.చాక్లెట్: చాక్లెట్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ, చాక్లెట్‌ ఎక్కువగా తింటే తలనొప్పి సమస్య ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్‌లో టైరమైన్‌ ఉంటుంది. ఇది బ్లడ్‌ ప్రెజర్‌ను పెంచుతుంది. 4-5 ముక్కలు లేదా మొత్తం చాక్లెట్ మాత్రమే తినడం మంచిది కాదు. కెఫిన్, టైరమైన్ ఉన్న చాక్లెట్ మీకు తలనొప్పిని ఇస్తుంది.పాలు: మీకు లాక్టోస్‌ అలెర్జీ ఉంటే.. పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటే.. తలనొప్పి సహా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పిని ట్రిగ్గర్‌ చేస్తుంది.

Also Read : వేపచెట్టుకు అమ్మవారి ఆకారం

సిట్రస్ పండ్లను జీర్ణించుకోలేని వ్యక్తులు స్వీట్‌ లెమన్‌, ద్రాక్ష పండ్లు, నారింజ పండ్లు తిన్నా.. తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌: చాలా మంది డయాబెటిక్‌ పేషెంట్స్‌.. షుగర్‌ను స్కిప్‌ చేసి ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ తీసుకుంటూ ఉంటారు. కానీ, ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ను మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ ఎక్కువగా తీసుకునే వారిని తలనొప్పి సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే.. అస్పర్టమే‌.. డోపమైన్‌ స్థాయిలను తగ్గించి.. తలనొప్పిని ప్రేరేపిస్తుంది.ఇతర కూరగాయలు, పండ్లు: క్యాబేజీ, బెండకాయ, ఫ్రోజెన్ ఫిష్, వేరుశెనగ వంటి ఆహారాల్లో కూడా టైరమైన్ ఉంటుంది. ఇది హెడ్‌ ఏక్‌ను ట్రిగర్‌ చేస్తుందని, తరచూ తలనొప్పితో బాధపడేవారు, మైగ్రేన్ సమస్య ఉన్నవారు.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని వీలైనంత వరకు తీసుకోవడం మానేయాలి.మితిమీరిన అమృతం విషం అన్న సామెత ప్రకారం మితంగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ అది ఎక్కువైతే సమస్యలు మిమ్మల్ని బాధపెడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube