శీతాకాలంలోనూ చన్నీళ్లు తాగుతున్నారా..

శీతాకాలంలోనూ చన్నీళ్లు తాగుతున్నారా..

0
TMedia (Telugu News) :

శీతాకాలంలోనూ చన్నీళ్లు తాగుతున్నారా..?

లహరి, ఫిబ్రవరి 6, ఆరోగ్యం : చాలా మందికి కాలంలో పనిలేకుండా ఇష్టనుసారం వేడినీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అలాగే చల్లటి నీరు తాగే అలవాటు ఉన్నవారు కూడా అందుకు ఇష్టపడతారు. అయితే చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. చలికాలంలో చల్లటి నీరు మీ శరీరానికి ఎలాంటి హాని చేస్తుందో మీకు తెలిస్తే.. మీరు తక్షణమే గోరువెచ్చని నీటిని తాగడం ప్రారంభిస్తారు. చల్లని నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, దంత సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అన్నింటిలో మొదటిది ఏమిటంటే చన్నీరు తాగిన మరుసటి రోజు మీ ముక్కు మూసుకుపోతుంది. అంతే కాకుండా జలుబు సమస్య వల్ల ఛాతీలో కఫం, తలనొప్పి వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చలికాలంలో చల్లటి నీరు తాగడం మానుకోవాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చల్లటి నీరు మీ గొంతును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీరు గొంతు నొప్పి, వాయిస్ కోల్పోవడం వంటి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఇంకా గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది హృదయ స్పందన రేటును మరింతగా పెంచుతుంది.

Also Read : ఆసరా పింఛన్లకు రూ.272 కోట్లు అధికం

చల్లటి నీరు జీర్ణక్రియనూ ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను మీకు కలిగుతాయి. ఛాతీలో శ్లేష్మం, తలనొప్పి వంటి సమస్యలు: చలికాలంలో చన్నీటిని తాగడం వల్ల మీకు జలుబు చేస్తుంది. అంతే కాక దాని వల్ల మీ దంతాలను దెబ్బతింటాయి. దంతాలు జలదరించే సమస్యలు రావచ్చు. ఇంకా చల్లని నీరు మీ దంతాలలోని నరాలను బలహీనపరుస్తుంది. అదనంగా, మీ కడుపుకు హాని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియలో కూడా సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటు వికారం, కడుపు నొప్పి కలగవచ్చు. అందుకే చలికాలంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తాగండి. కేవలం రుచి కోసమో, అలవాటు కోసమో చల్లటి నీరు తాగకండి. ఇది మీ శరీరంలో అనేక విధాలుగా హానికరమని తెలుసుకోండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube