ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేస్తే.?
లహరి, అక్టోబర్ 7, ఆరోగ్యం : చాలా మంది స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఉప్పు కలుపుకొని స్నానం చేస్తూ ఉంటారు. అలా ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక అనారోగ్యాల నుండి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు. ఉప్పులో ఉండే సోడియం, మెగ్నీషియం, ఐరన్ మనకు ఎంతో మేలు చేస్తాయని, ఉప్పును నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినప్పటికీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. ఉప్పులో ఉండే సహజ సిద్ధమైన ఖనిజాలు, పోషకాలు చర్మానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండటం కోసం ఉప్పులోని సహజ ఖనిజాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు. నీళ్లలో ఉప్పు వేసుకుని ఉప్పు నీళ్లతో తలస్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్పు నీళ్లతో తలస్నానం చేయడం వల్ల తలలో చుండ్రు మాయమవుతుంది. చుండ్రు సమస్య ఉన్నవారు ఉప్పును నీళ్ళలో వేసుకుని స్నానం చేయడం మంచిది. ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల చుండ్రు రాకుండా ఉంటుంది. ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేయడం వల్ల శరీరం నొప్పులు తగ్గుతాయి. ఉప్పు నీళ్ల స్నానం కండరాల నొప్పులను గణనీయంగా తగ్గిస్తుంది. ఉప్పులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దురద నుండి కాపాడతాయి ఉప్పు నీళ్లతో స్నానం చేస్తే అలర్జీలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
Also Read : 15 నుంచి ఏడుపాయల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఉప్పు నీళ్లతో స్నానం చేయడం చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుందని, చర్మం డ్రై కాదని చెబుతున్నారు. ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఉప్పు నీళ్లతో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయని, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని, ఉప్పు కలిపిన నీళ్ళతో సున్నితంగా శరీరాన్ని మర్దన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ తీరు మెరుగవుతుందని చెబుతున్నారు. చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్న వారు కూడా ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల వృద్ధాప్యాన్ని దూరం నెట్టవచ్చని చెబుతున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube