ప్రతిరోజు వ్యాయామం- ఆరోగ్యానికి ఆనందమయం

ప్రతిరోజు వ్యాయామం- ఆరోగ్యానికి ఆనందమయం

1
TMedia (Telugu News) :

ప్రతిరోజు వ్యాయామం- ఆరోగ్యానికి ఆనందమయం

టీ మీడియా, సెప్టెంబర్ 23, మధిర: ప్రతిరోజు వ్యాయామం- ఆరోగ్యానికి ఆనందమయం అని మాటూరుపేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ అన్నారు.ప్రభుత్వ ఆదేశం ప్రకారం మాటురిపేట ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఒకరి నుంచి ఒకరికి అంటని వ్యాధులు కేంద్రము ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం 30 సంవత్సరములు దాటిన వారందరికీ రక్తపోటు, మధుమేహము (షుగర్) పరీక్షలు నిర్వహించగా 20శాతం మందిలో రక్తపోటు, 15శాతం మందిలో మధుమేహం ఉన్నదని అదేవిధంగా అతిమూత్రం ,అతి దాహం అతి ఆకలి, పాదాల తిమ్మిర్లు షుగర్ వ్యాధి లక్షణాలని, తీవ్రమైన తలనొప్పి ,అలసట, దృష్టి సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె కొట్టుకోవడంలో తేడా ఇవన్నీ కూడా అధిక రక్తపోటు లక్షణాలని

Also Read : బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ భర్తల పెత్తనం

కావున ప్రజలంతా ముందే మేల్కొని ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు ఒక గంట సేపు నడక, యోగాసనాలు, స్విమ్మింగ్ చేయాలని ముఖ్యంగా ఆహారం తినేటప్పుడు 40 శాతం కార్బోహైడ్రేట్స్ (ముడి బియ్యం)+ 40 శాతం ప్రోటీన్స్+ 20శాతం కొవ్వు పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలని, మాటూరుపేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ గారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కరరావు, శరత్ బాబు, మరియరాణి సుభాషిని, స్టాఫ్ నర్స్ మార్తమ్మ ఫార్మసిస్ట్ రవి, శ్రీను ,ల్యాబ్ టెక్నీషియన్ పుతిలి భాయ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube