నిరుపేదలకు పౌష్టికహారం పంపిణీ

నిరుపేదలకు సహాయం చేయడమే మా ద్యేయం

1
TMedia (Telugu News) :

నిరుపేదలకు పౌష్టికహారం పంపిణీ

నిరుపేదలకు సహాయం చేయడమే మా ద్యేయం

టీ మీడియా,ఏప్రిల్ 30, గోదావరిఖని : స్థానిక ఆశాజ్యోతి కార్యాలయంలో నిరుపేద పిల్లలకు జన్మదిన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరు పేద పిల్లలకు పోషకాహార పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది.కి.శే రొంటాల కొమురయ్య, నర్సమ్మ దంపతుల జ్ఞాపకార్థం సందర్భంగా వారి పిల్లలు జనగామ స్వప్న, సహర్ష,సుహాస్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరిగింది.

Also Read : మరణానంతరం శరీరాలను దానం

ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్,రేణికుంట్ల నరేంద్ర మాట్లాడుతూ…ఈ ప్రాంతంలో ఎక్కడ పేద వారు ఉంటే అక్కడ మా సంస్థ ద్వారా తోచిన సహాయం అందిస్తున్నామని ముక్యంగా ఇలాంటి నిరు పేద పిల్లలకు సహయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని ఇలాంటి పిల్లలకు చేసే అవకాశాన్ని కల్పించిన స్వప్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పౌష్టిక ఆహారంతో పాటు నిత్యవసర సరుకులు, మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇక ముందు కూడా సహాయం అందిస్తామని తెలియజేసారు.ఈ కార్యాయక్రమంలో ఆశాజ్యోతి సిబ్బంది ప్రాజెక్ట్ డైరెక్టర్ మిట్టపల్లి లిటిల్, పిడి లావణ్య,
జ్యోతి,తిరుమల, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube