చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

0
TMedia (Telugu News) :

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీ మీడియా, అక్టోబర్ 17, అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ కోరుతూ ఆయన లాయర్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ ప్రారంభం కాగానే తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.

Also Read : ఈ ప్రభుత్వానికి ఆ హక్కు ఎక్కడిది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube