టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

1
TMedia (Telugu News) :

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

టీ మీడియా, ఆగస్టు3, నల్లగొండ : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకులపాడ్, శాలిగౌరారం గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

 

Also Read : విజయవాడ-నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసారు. అనంతరం దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని లబ్ధిదారుడికి అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube