9వ తేదీ వరకు భారీ వర్షాలు

రెడ్ అల‌ర్ట్ జారీ

1
TMedia (Telugu News) :

9వ తేదీ వరకు భారీ వర్షాలు

-రెడ్ అల‌ర్ట్ జారీ

టీ మీడియా, ఆగస్టు 6,హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

 

Also Read : చంద్రబాబును అవమానించిన ఎంపీ కేశినేని నాని

 

దీనికి తోడు రుతుపవన ద్రోణి బికనీర్‌, కోటా, రైసెస్‌, రాయపూర్‌, దిఘాల మీదుగా ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళుతూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆవర్తనం ఏపీలోని ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడుగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube