మూడు రోజుల పాటు భారీ వర్షాలు

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

1
TMedia (Telugu News) :

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

టీ మీడియా,జూన్ 21,హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి ఇవాళ బలహీనపడిందని తెలిపింది.

Also Read : తవ్వకాలను ఆపి రైతాంగాన్ని ఆదుకోవాలి…

కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కుసిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube