బిపిన్ రావత్ కి ఘనంగా నివాళులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 9,పినపాక;

పినపాక మండల కాంగ్రెస్ పార్టీ ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో గల కార్యాలయంలో బుధవారం పినపాక కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశం,సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమము జరిగినది.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రివిధ దళాల అధికారి బిపిన్ రావత్ కి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామనాథం మాట్లాడుతూ…. భారత స్ఫూర్తిదాయక కమాండర్ బిపిన్ రావత్ అని సైన్యం,నావికా,వైమానిక దళాల సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణ మంత్రికి సలహాదారుగా వ్యవహరించారని అన్నారు.
ఆయన చనిపోవడం దేశానికి తీరనిలోటని అన్నారు.
ఈ సమావేశానికి కొర్సా ఆనందు, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎస్.కె మదర్ సాహెబ్, మండల సభ్యుడు పూనెo వెంకటేష్,జిల్లా మహిళ సభ్యురాలు గొంది రాధా,పొనుగోటి చందర్రావు, చందా ప్రసాద్, జరుపుల రాము తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube