నిరుపేద కుటుంబానికి చేయూత

నిరుపేద కుటుంబానికి చేయూత

1
TMedia (Telugu News) :

నిరుపేద కుటుంబానికి చేయూత

టి మీడియా,జులై 25,పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరసయ్య మల్లేశ్వరి దంపతుల కుమార్తె సుకన్య పెళ్లికి ఆర్ష ఫౌండేషన్ అధ్యక్షులు బుడిద హర్ష తనవంతు సహాయంగా 25 కేజీల బియ్యం ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డా, సురభి శ్రీధర్ హాజరై మాట్లాడారు. సేవకు ప్రతిరూపమైన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతమని ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నమంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 4న సుకన్య పెళ్లి ఉండగా ఆ పెళ్లి విషయం తన తెలుపగా.ఆర్ష ఫౌండేషన్ ను సహాయం కోరగా ఫౌండేషన్ నిర్వాహకులు స్వర్గీయ తిప్పారు సుదర్శన్ జ్ఞాపకార్థం‌ సుకన్య కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది అన్నారు.

 

Also Read : పార్ధ ఛ‌ట‌ర్జీ ఆస్తులపై ఈడీ ఆరా

గతంలో ఆర్ష తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడం జరిగిందని. తను చేస్తున్నా సేవ కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ సర్వీష్, ఇప్పారపు శ్రవణ్,తిప్పారపు శరత్ , భోగి శ్రీనివాస్ చందనాల సంతోష్ తో పాటు సుకన్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube