అర్హులైన మైనార్టీలను ఆదుకోవాలి

అర్హులైన మైనార్టీలను ఆదుకోవాలి

1
TMedia (Telugu News) :

అర్హులైన మైనార్టీలను ఆదుకోవాలి

టీ మీడియా, సెప్టెంబర్ 19, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంకు చెందిన టిఆర్ఎస్ మైనార్టీ నాయకుల బృందం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భీటి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి ముస్లిం మైనారిటీలకు సంబంధించిన,పలు విషయాలు వివరించడం జరిగింది. వనపర్తి పట్టణంలో అర్హులైన పేద ముస్లింలకు డబల్ బెడ్రూమ్ కేటాయించాలని. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లు, మైనార్టీ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని, జిల్లాలోని స్మశాన వాటికలు,దర్గాల బౌండ్రి వాల్ నిర్మాణం పనులకు నిధులు విడుదల చేయాలని వివరించడం జరిగింది.

Also Read : లోకేశ్‌ రాకతో టీడీపీ పతనం మొదలైంది

ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గట్టు యాదవ్, కౌన్సిలర్ ఎండీ. సమద్ పాషా, మున్సిపల్ కో – ఆప్షన్ గులామ్ ఖాదర్ ఖాన్, ఇమ్రాన్ బిన్ ఆలీ, వక్ఫ్ ప్రొటెక్షన్ కోఆర్డినేషన్ మెంబర్ అర్షద్ అహ్మద్, టిఆర్ఎస్ మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ జోహైబ్ హుస్సేన్,సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, ఎండీ రహీమ్, ఎండీ బాబు,ఎండీ అరిఫ్ పాపులర్, స్టార్ రహీమ్, ఇన్వెటెర్ పాషా, నిరంజన్, ఖాజా, అస్లాం, హలీం ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube