అన్నదానానికి సహాయం చేసిన ఎంపీపీ
టీ మీడియా, ఫిబ్రవరి 16, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని చింతల హనుమాన్ దేవాలయం శివ దీక్ష సేవా సమితి శివస్వాముల నిత్య అన్నదానం కోసం పెద్దమందడి ఎంపిపి తూడి మేఘారెడ్డి రూ.1,50,000 ల ఆర్థిక సహాయం చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంపీపీ మేఘారెడ్డి నివాస గృహంలో ఆర్థిక సహాయాన్ని శివ దీక్ష సేవా సమితి అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి పరుశురాం లకు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీ చింతల హనుమాన్ దేవాలయ శివ దీక్ష సేవా సమితి శివ స్వాముల నిత్య అన్నదానం కోసం రూ.1,50,000ల ఆర్థిక సహాయం అందజేసిన పెద్ద మందడి ఎంపిపి తూడి మేఘారెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, బుచ్చన్న, శివ దీక్ష సేవా సమితి అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి బి. పరుశురాం తదితరులు పాల్గొన్నారు.