చిరు వ్యాపారులుకు అండగా ఉంటాం

చిరు వ్యాపారులుకుఅండగా ఉంటాం

1
TMedia (Telugu News) :

చిరు వ్యాపారులుకుఅండగా ఉంటాం

టీ మీడియా, ఎప్రిల్ 01,మధిర: చిరు వ్యాపారులకు బాసటగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నిలుస్తున్నారు. ప్రస్తుతం మధిర లో నెలకొన్న చిరు వ్యాపారుల సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన గురువారం నాడు మధిర మున్సిపల్ పాలకవర్గం తో కలసి ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మధిర పట్టణంలో ఎన్నో కుటుంబాల వారు చిరు వ్యాపారాల పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పలు రకాల చిన్న చిన్న వ్యాపారాలను నడుపుతూ మధిర ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం వారి బడ్డీ షాప్స్ తొలిగింపు నిర్ణయం తో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎంతో కాలంగా వారు వారి వ్యాపారాల పై ఆధారపడి ఉన్నారని వారికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. మధిర లో చిరు వ్యాపారులకు వారి జీవన భృతి కోల్పోకుండా వారికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పూర్తిగా అండగా నిలవాలని కోరారు. కలెక్టర్ కూడా అందుకు సానుకూలంగా స్పందించి తప్పకుండా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్, వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Also Read : పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి… గడువు పొడిగింపు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube