అనాధలకి చేయూత

అనాధలకి చేయూత

1
TMedia (Telugu News) :

అనాధలకి చేయూత

టీ మీడియా, ఏప్రిల్ 12, వనపర్తి, బ్యూరో : వనపర్తి పట్టణం పాతబజార్ కి చెందిన రమేష్ యాదవ్ గత ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు. అతని భార్య రాధమ్మ పిల్లలను చేసుకుంటూ బతుకుదెరువు కోసం కూలిపని చేస్తూ జీవనం సాగించేది, కానీ ఈ మధ్యనే రాధమ్మ అనారోగ్యంతో చనిపోగా పిల్లలిద్దరూ అనాధలయ్యారు. పెద్దవాడైన 13 ఏళ్ల బాబు గట్టు, 11 సంవత్సరాల బేబీ సింధు అనాధలయ్యారు. ఇది తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ అతని యాదవ మిత్రబృందం కలిసి పరామర్శించి ఆ పిల్లల చదువులకు తదితర అంశాలు మేము చూసుకుంటామని ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి పిల్లలు సమాజంలో చాలామంది ఉంటారు. మేము చేసే ఈ కార్యక్రమం వల్ల మరి కొందరు మరికొందరిని దత్తత తీసుకొని వారిని చదివించి వారి కాళ్లపై నిలబెట్టాలని అందర్నీ సందర్భంగా వేడుకున్నారు.

also read : ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

సమాజంలో గుడిలకి ఉత్సవాలకు పెట్టే ఖర్చు వృధా అయిపోతాయి. కానీ ఇలాంటి అనాధ పిల్లలకు సహాయం చేస్తే వారి పేరు చిరకాలం ఉంటుంది. కనుక ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ మిత్ర బృందం సభ్యులు గురురాజు యాదవ్, రాములు యాదవ్ ప్రిన్సిపాల్, కృష్ణయ్య ,గోపాలకృష్ణ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube