అనాధ బాలిక పట్ల పోలీసుల ఔదార్యం

అనాధ బాలిక పట్ల పోలీసుల ఔదార్యం

2
TMedia (Telugu News) :

అనాధ బాలిక పట్ల పోలీసుల ఔదార్యం

టీ మీడియా, ఏప్రిల్ 14, వనపర్తి, బ్యూరో : వనపర్తి జిల్లా పానగల్ మండలం పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ఇందిరమ్మ దంపతులు గత కొంత కాలం క్రితం ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఐదు సంవత్సరాల కుమార్తె అనాధగా మిగిలిపోయింది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన కొందరు పోలీసుల దృష్టికి తీసుకురావడంతో జిల్లా ఇన్చార్జ్ ఎస్పి రంజాన్ రతన్ కుమార్ చలించిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు గత మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా బాధ్యతను పోలీసులు తీసుకుని తమవెంట తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు.

Also Read : అల‌క‌వీడిన ఏపీ మాజీ మంత్రి సుచ‌రి

బాలిక ఆరోగ్యం మెరుగుపడగానే గ్రామంలో తన ఇంటి దగ్గర ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ పరిస్థితులు ఎస్పీకి తెలపగా వెంటనే బాలిక బాగోగులు చూసుకుంటున్నా నాన్నమ్మ తాతయ్య బుధవారం వనపర్తి గద్వాల సిఐలు ప్రవీణ్ కుమార్ శివ కుమార్ పానగల్ ఎస్సై నాగన్నల చేతులమీదుగా నిత్యావసర సరుకులు రెండు క్వింటాళ్ల బియ్యం, పప్పు దినుసులు, నూనె, దుస్తులతో పాటు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇకముందు కూడా బాలికకు పోలీసులు అండగా ఉంటూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దేవరాజ్, హెడ్కానిస్టేబుల్ నాగరాజ్, సిబ్బంది హర్షవర్ధన్, పరశురాముడు,, గౌస్ పాష, అంజి, ఎల్లస్వామి తదితరులుపాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube