విద్యార్థికి ఆర్థిక సాయం
టీ మీడియా, ఏప్రిల్ 22, వనపర్తి, బ్యూరో : శ్రీరంగాపురం మండలం నాగరాల గ్రామానికి చెందిన చారకొండ లక్ష్మి తండ్రి. చారకొండ కురుమయ్య అనే దళిత విద్యార్థి ఎంబీబీఎస్ సీటు మరియు ఆమెకు మద్దతుగా ఒక సంవత్సరానికి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల చెక్కు ఇచ్చి ఆమెకి చేదోడువాదోడుగా నిలిచిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అదేవిధంగా గుంటి శివకుమార్ గుండె వైద్య పరీక్షల కోసం అపోలో హాస్పిటల్ నందు ఆపరేషన్ జరగగా ఇట్టి బిల్లును మినిస్టర్ దృష్టికి తీసుకురాగా ఆ బిల్లుల కింద రెండు లక్షల 50 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
Also Read : గుండెపోటు తో కుప్పకూలిన గవర్నర్ అటెండర్
ఈ సందర్భంగా నాగరాల గ్రామ సర్పంచ్ నిర్మల రాధాకృష్ణ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా గ్రామంలో 86 కుటుంబాలకు మేలు జరిగింది. ఇప్పటికి మా గ్రామంలో ఎంబీబీఎస్ సీటు గాని ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు వచ్చే సీటు సంపాదించిన వారికి ప్రభుత్వం తరఫున ఫీజు రీయింబర్స్‌మెంటు ఇప్పిస్తానని గ్రామపంచాయతీ తరుపున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగరాల సర్పంచ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube