అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం

అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం

1
TMedia (Telugu News) :

అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం
టీ మీడియా ,ఏప్రిల్ 29 ,చింతూరు : చింతూరుమండలం లక్కవరం గ్రామం లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా మిడియం లక్ష్మయ్య ఇ ల్లు కాలిపోవడం జరిగిన విషయం తెలుసుకున్న సర్వేయర్ దీపికా మరియు ఆమె స్నేహితులు వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేయర్ దీపికా మాట్లాడుతూ అగ్నికి ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు అని వారిని పరామర్శించి మా వంతు సహాయంగా ఇల్లు కాలిపోయిన కుటుంబానికి బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు బట్టలు దుప్పట్లును వంట సామాగ్రిని మరియు రెండు వేల రూపాయల నగదును మరియు లక్కవరం గ్రామంలోని చిన్నారులకు బుక్స్ మరియు పెన్నులు,స్నాక్స్ అందజేయడం జరిగిందని తెలియజేశారు.

Also Read : ఆవిర్భావ దినోత్స‌వం విజ‌య‌వంతం చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు

అదేవిధంగా ఎన్నో సేవా సంస్థల వారు ఉన్నారని వారు కూడా కుటుంబ సభ్యులు పరిస్థితి చూసి వారినీ ఆదుకోవాలని సర్వేయర్ దీపికా కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు సర్వేయర్ దీపికా కోవిడ్ సమయంలో బియ్యం కూరగాయలు నిత్యావసరాలు ను కొండ గిరిజన ప్రాంతాల్లో అందించి మరియు హిల్ టాప్ గ్రామమైన ఎరువాడలో హెల్త్ క్యాంప్ ను నిర్వహించారని ఆమె సేవలను కొనియాడారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube