డాక్టర్ రాజా రమేష్ మిత్ర బృందం ఆర్థిక సాయం

డాక్టర్ రాజా రమేష్ మిత్ర బృందం ఆర్థిక సాయం

0
TMedia (Telugu News) :

డాక్టర్ రాజా రమేష్ మిత్ర బృందం ఆర్థిక సాయం

టీ మీడియా,జూన్ 28,రామకృష్ణాపూర్; స్థానిక ఆర్ కే1 సుభాష్ నగర్ కి చెందిన మచ్చ అశోక్ భార్య మచ్చ శ్రీలత గత కొన్ని నెలల నుంచి చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడం తో సోమవారం వారికి డాక్టర్ రాజా రమేష్ బాబు వారి మిత్రబృందం, సిరి ఫౌండేషన్ సభ్యులతో కలిసి వెళ్లి వారికి వైద్య ఖర్చుల కోసం ఐదువేల రూపాయలు, 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా చిల్లర సామాన్ ఇవ్వడం జరిగింది.

Also Read : అరేబియా సముద్రం పై… ఓ ఎన్ జీసీ హెలిక్యాప్టర్ అత్యవసర ల్యాండింగ్

ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీలత త్వరగా కోలుకోవాలని, అశోక్ మళ్లీ ఉద్యోగం చేసుకుంటూ వారి పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని కోరారు గత కొంత కాలం నుండి సహాయం చేస్తున్న దాతలు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు చెప్పడం జరిగింది. యువత ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలను ఇంకా ఎన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్రి సతీష్ , కడగొండ సాయికుమార్, నరెడ్ల వెంకన్న, ప్రకాష్ , రామ్ కిషోర్, శివకుమార్, ఓరుగంటి సాయి, నర్సింగమ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube