గీత కార్మికునికి రు15000 లుఆర్థిక సహాయం

గీత కార్మికునికి రు15000 లుఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

గీత కార్మికునికి రు15000 లుఆర్థిక సహాయం

టీ మీడియా, ఆగస్టు 03, ములుగు జిల్లా బ్యూరో: వెంకటాపూర్ 🙁 రామప్ప )గత నెలలో వెంకటాపూర్ మండల కేంద్రనికి చెందిన దేశిని నరేష్ గౌడ్ తన విధినిర్వహణలో భాగంగా తాటిచెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కాలు జారి క్రింద పడగ ముక్కు బొక్క విరిగింది. కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు అయినాయి. వెంటనే కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధితుణ్ణి పరామర్శించి టాడి కార్పొరేషన్ కు దరఖాస్తు చేయడం జరిగింది.కాగా టాడి కార్పొరేషన్ నుండి మంజూరు అయినా 15000/- చెక్కును బాధిత కుటుంబానికి ఈరోజు బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి లక్ష్మాన్ గారు మరియు కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మేళ్ల సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా బీసీ వెల్పర్ అభివృద్ధి అధికారి లక్ష్మాన్ గారు మాట్లాడుతూ తాటి చెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

 

Also Read : డివిజన్ లో పువ్వాడ వివాహ పత్రికలు పంపిణీ

 

విషయం తెలియగానే వెంటనే స్పందించి సహకరించిన టాడి కార్పొరేషన్ చైర్మన్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఐఏఎస్ గారికి,బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్ గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, టాడి కార్పొరేషన్ ఎండీ ఉదయ్ ప్రకాష్ గారికి, జూనియర్ అసిస్టెంట్ పాముకుంట్ల రవీందర్ గౌడ్ గారికి,కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్ గారికి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి రమణ గారికి,సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్ గారికి దేశిని నరేష్, వారి కుటుంబ సభ్యులు మరియు కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం వెంకటాపూర్ అధ్యక్షులు మునిగాల మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు గునిగంటి శోభన్ గౌడ్,గౌడ సంఘం సీనియర్ నాయకులు మునిగాల కట్టయ్య గౌడ్,పులి రమేష్ గౌడ్, పోశాల చంద్రమోగిలి, దేశిని మహేందర్, గౌడ్,చిరంజీవి గౌడ్ తదితర 20 మంది కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube