బాధిత కుటుంబాల కు నిత్యావసర సరుకులు

బాధిత కుటుంబాల కు నిత్యావసర సరుకులు

2
TMedia (Telugu News) :

బాధిత కుటుంబాల కు నిత్యావసర సరుకులు

టి మీడియా,మార్చి11,మధిర:స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో స్కోప్అర్టి ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో కోవిడ్ బాధిత కుటుంబ పిల్లలకు నిత్యావసర సరుకులు పంపిణీని ఎంపీపీ మొండెం లలిత చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వలన ఎన్నో కుటుంబాలుకు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని విచారణ వ్యక్తం చేశారు.అటువంటి సందర్భాలలో పిల్లల వారి తల్లిదండ్రులు కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు.

Also Read : దివ్యాంగుల స్వయం ఉపాధి కి ప్రభుత్వం చేయూతనివ్వాలి

తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వారు ఆత్మ ధైర్యంతో సాగాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. చిల్డ్రన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా పిల్లలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ అనాధలైన పిల్లలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త కే శ్రీనివాస్, ఏ.సి.డి పి.ఓ వీరభద్రం, వెంకన్న బాబు, సభ్యులు అనూష, గురుమూర్తి, వెంకటేష్, మధిర మండలం, ఎర్రుపాలెం మండలంపాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube