వరద భాదితులకు ఈత మిత్రుల చేయూత

వరద భాదితులకు ఈత మిత్రుల చేయూత

1
TMedia (Telugu News) :

వరద భాదితులకు ఈత మిత్రుల చేయూత
టి మీడియా,ఆగస్టు6,భద్రాచలం: భద్రాచలం గోదావరి వరద బాధితుల సహాయార్థం శనివారం ఖమ్మం లెఫ్ట్ కెనాల్ స్విమ్మర్స్ అసోసియేషన్ సౌజన్యంతో సుమారు 1,25,000 విలువ కలిగిన దుప్పట్లు, చీరలు, మొత్తం 300 ప్యాకింగ్ లు బాగా వరదతో దెబ్బతిన్నటువంటి భద్రాచలం సమీపంలోని తూరుబాక మరియు బండారుగూడెం గ్రామాల ప్రజలకు అందచేయడం జరిగింది.

Also Read : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ, మన్మోహన్ సింగ్

ఈ సందర్బంగా లెఫ్ట్ కెనాల్ స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్విమ్మింగ్ మిత్రులు సామజిక సేవలో ఎల్లపుడు ముందు నిలవడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ స్విమ్మర్ వేగనాటి లక్ష్మయ్య, బోజెడ్ల ప్రభాకర్ రావు, జి వెంకటాచారి, మండెపూడి సత్యనారాయణ, మంకెన శ్రీనివాసరావు , కమర్తం గోపాలరావు, బారీ శ్రీను, సిహెచ్. నరసింహరావు మరియు బండి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube