సహాయం చేయలంటే ఉండాల్సింది డబ్బుకాదు. మనసు

సహాయం చేయలంటే ఉండాల్సింది డబ్బుకాదు. మనసు

1
TMedia (Telugu News) :

సహాయం చేయలంటే ఉండాల్సింది డబ్బుకాదు మనసు

లహరి,నవంబర్15,సికింద్రాబాద్‌ : జీవితంలో ఎవరికైనా సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం మరే పనిలో కనిపించదు. అయితే ఒకరికి సహాయం చేసిన తర్వాత.. ఆ సాయం అందుకున్న వ్యక్తి చేసే పనులతో ఆ సాయం కొన్నిసార్లు నీరు కారిపోతుంది. జీవితంలో సహాయం కోరడం , చేయడం వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకుందాం.సాయం అనేది ఒక పదం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి జీవితంలో సాయం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సాయం ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక సమయంలో లేదా మరొకరితో ముడిపడి ఉంటుంది. మనం ఎవరికైనా సహాయం చేసినా లేదా ఎవరైనా సహాయం తీసుకున్నా సందర్భాలు అనేకం ఉంటాయి. వాస్తవానికి మనిషి పుట్టింది మొదలు.. మరణించే వరకూ జీవితంలో ఎవరొక సహాయం తీసుకోకుండా, ఒకరికి సహాయం చేయకుండా ఉండడం జరగదు.

Also Read : సూర్యదేవాలయం శిల్ప కళానైపుణ్యం

భూమి మీద పుట్టిన తర్వాత మన నడత, నడక, దిశానిర్ధేశం ఇలా ప్రతి ఒక్క సందర్భం కుటుంబ సభ్యులు, స్నేహితులు సన్నిహితుల సాయంతోనే జరుగుతుంది. జీవితంలో ఎవరికైనా సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం మరే పనిలో కనిపించదు. అయితే ఒకరికి సహాయం చేసిన తర్వాత.. ఆ సాయం అందుకున్న వ్యక్తి చేసే పనులతో ఆ సాయం కొన్నిసార్లు నీరు కారిపోతుంది. జీవితంలో సహాయం కోరడం , చేయడం వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం..


జీవితంలో సంపాదించిన సంపద కూడా అంతం కావచ్చు, కానీ ఒకరి సహాయం చేసిన తర్వాత వారి నుండి పొందిన దీవెనలు ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి.ఏ వ్యక్తికైనా సహాయం చేయాలంటే అన్ని సమయంలోనూ డబ్బు మాత్రమే అవసరం కాదు.. సాయం చేయాలంటే ముందుకు మనిషికి కావాల్సింది మంచి మనసు.మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే ఇతరుల సహాయాన్ని స్వీకరించండి.. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుర్మార్గుడి సహాయాన్ని స్వీకరించవద్దు.మీ కష్ట సమయాల్లో కూడా మీకు అండగా ఉండి.. అన్నివిధాల అండగా ఉంటూ.. డబ్బు సహా ఏ విధంగానైనా మీకు సహాయం చేసే వ్యక్తి మీ నిజమైన శ్రేయోభిలాషి.ఒక విజయవంతమైన వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఒక విఫలమైన వ్యక్తి తాను ఇతరులకు సహాయం చేయడం వలన తనకు ఏమి ప్రయోజనం ఉంటుందని అలోచించి ప్రతి విషయంలోనూ లెక్కలు వేస్తాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube