మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

టీ మీడియా, మార్చి 17, వనపర్తి : పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆటవిడుపుగా స్థానిక ఈదుల చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ సహాయము మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏర్పుల వెంకటయ్య యాదవ్ ద్వారా మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు రవి యాదవ్, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ లక్ష్మి, టిడిపి గౌస్, తెలుగుదేశం ఆటో యూనియన్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : మాజీ కౌన్సిలర్ కి నివాళి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube